calender_icon.png 13 November, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె రాములు

11-08-2024 12:05:00 AM

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు జయంతిని శనివారం వేములవాడలో ఘనంగా నిర్వహించారు. మిద్దె రాములు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒగ్గు కథలకు వన్నె తెచ్చిన మహనీయుడు మిద్దె రాములు అని కొనియాడారు. తలపై బోనమెత్తి చేసే ప్రదరనలు ఖండాంతరాలు వ్యాప్తి చెందిద న్నారు. గతంలో ఇందిరాగాంధీ సభలో తన కథాగానంతో ప్రజలను మైమరిపించారని గుర్తు చేశారు. మిద్దె రాములు లేని లోటు ఈ ప్రాంతానికి తీరనిదని చెప్పారు. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆది శ్రీనివాస్ అన్నారు.