calender_icon.png 13 September, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలాద్ ఉన్ నబీ పండగ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలి

13-09-2025 02:32:45 AM

 ఘట్ కేసర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : మిలాద్ ఉన్ నబి పండగ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ బాలస్వామి అన్నారు.  మిలాద్ ఉన్ నబి పండగ ర్యాలీ నిర్వహించనున్న సందర్భంగా ఘట్ కేసర్ పోలీసులు శుక్రవారం అన్ని మతాల పెద్దలతో  పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించినారు.

అన్ని కుల మతాల పెద్దలు దాదాపు 60 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ బాలస్వామి మాట్లాడుతూ  సామరస్య వాతావరణంలో అనుకూల పరిస్థితులలో  మిలాద్ ఉనబి పండగ నిర్వహించాలని పలు సూచనలను ఇచ్చారు.