సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
నల్లగొండ టౌన్, జూలై 2 : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1న మారుమూల గ్రామాల్లోని గోపాలమిత్రులకు వేతనాలు అందడంతో గోపాలమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సంస్థ చైర్మన్ డా. సింగం చరణ్ కౌశిక్ యాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల చిత్రపటాలకు గురువారం కార్యాలయం వద్ద క్షీరాభిషేకం చేశారు.
25 ఏళ్లుగా పశుసంవర్ధక శాఖకు వెన్నుముకగా సేవలందిస్తున్న గోపాలమిత్రులకు విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం, కనీస వేతనం రూ.26 వేలు, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కావటి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నూక మల్లేష్, శంభు లింగం, సురేష్, జానయ్య, భీక్షం, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆల్దాస్ లింగయ్య గౌడ్, సైదులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వంగూరు గోవింద్ యాదవ్, జర్రిపోతుల శ్రీనివాస్ గౌడ్, కొమరయ్య, శేఖర్, వెంకట్, మహాజన్, భీక్షం, రవి, లింగస్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






