3 July, 2026 | 2:38 AM

విద్యా రంగంలో సేవలకు గుర్తింపు

03-07-2026 01:55 AM

పీడీ నుండి ఎఫ్‌ఏసీ ప్రధానోపాధ్యాయుడిగా మల్లేష్కు కీలక బాధ్యతలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)జూలై 2: విద్యారంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి జిల్లా విద్యాశాఖ అధికారులు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం అర్వపల్లిలోని పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ లో గత కొంతకాలంగా ఫిజికల్ డైరెక్టర్గ పనిచేస్తున్న పగిడిమర్రి మల్లేష్ కు ఎఫ్‌ఏసీ ప్రధానోపాధ్యాయులుగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల బాధ్యతలు స్వీకరిస్తున్న మల్లేష్ కు గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థుల సమగ్ర వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని సేవలందిస్తున్న మల్లేష్ సార్ సేవలకు గుర్తింపుగా ఈ కీలక బాధ్యతలు లభించాయని, ఆయన తన అనుభవం, సమర్థ నాయకత్వం, క్రమశిక్షణతో పాఠశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.