09-07-2025 07:02:34 PM
కమ్యూనిస్టుల సమ్మెలో సిపిఐ నేత పిలుపు..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): కమ్యూనిస్టులు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బుధవారం మండల కేంద్రంలో ఏఐటియుసి(AITUC) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యవసాయ భద్రత కల్పించాలన్నారు. స్కీం వర్కర్ల అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు లేబర్ కోడ్ 4 ను రద్దు చేయాలని, రిటైర్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, భావన నిర్మాణ కార్మికులు, జీసిసి హమాలీల సహకారంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జై శివ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈ సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల ఇన్చార్జి కట్ల రాజు రాష్ట్ర నాయకులు టీవీకే మీనా కుమారి, ఎస్ పార్వతి పి అనిత జిల్లా నాయకులు కుర్స సమ్మక్క, అరుణకుమారి, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.