09-07-2025 06:59:34 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సార్వత్రిక సమ్మెలో బెల్లంపల్లి తపాలా ఉద్యోగులు(Postal Employees) పాల్గొన్నారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు బుధవారం బెల్లంపల్లి బజారులో ప్రదర్శన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్థిక విధానాలు లేబర్ కోడ్స్ తో రద్దు అయ్యే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపుతో సమ్మెలో పోస్టల్ ఉద్యోగులు, అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన IDC నీ తక్షణమే విరమించుకోవాలని గ్రూప్ సి రికగ్నైజేషన్ ను వెంటనే పునరుద్ధరించాలని యూనియన్ నాయకులు గ్రామీణ డాగ్ సేవక్ మంచిర్యాల బ్రాంచ్ కార్యదర్శి పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులందరూ తపాల కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.