calender_icon.png 10 July, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడిగా మల్లెపంగు నాగరాజు ఎన్నిక

09-07-2025 11:01:34 PM

చిలుకూరు: మాదిగ ఉద్యోగుల సంఘం(Madiga Employees Association) మండల అధ్యక్షులుగా చిలుకూరు గ్రామానికి చెందిన మల్లేపంగు నాగరాజును మంగళవారం మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగిందిని తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... మాదిగ ఉద్యోగ సంఘం నాయకులకు చిలుకూరు మండల అధ్యక్షులుగా నాపై నమ్మకం ఉంచి నాపై పెట్టిన ఈ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని ఉద్యోగుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి,రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సూరిబాబు మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు మాతంగి వీరస్వామి, మాతంగి మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.