calender_icon.png 10 July, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమోసాలో బల్లి కలకలం

09-07-2025 10:55:46 PM

తోల్కట్టలోని మహాలక్ష్మి స్వీట్ హౌస్‌ సీజ్..

చేవెళ్ల: సమోసాలో బల్లి రావడం కలకలం రేపింది.  బాధితుల వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు బుధవారం మొయినాబాద్ మండలం తోల్కట్ట గేటు వద్ద ఉన్న మహాలక్ష్మి స్వీట్ హౌస్‌(Mahalakshmi Sweet House)లో రెండు సమోసాలు కొన్నారు. ఇంటికి వెళ్లి ఒక సమోసా తిన్న తర్వాత, మరో సమోసాను తెరిచి చూస్తే అందులో బల్లి కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఒక అమ్మాయి వాంతి చేసుకోగా కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మహేందర్ రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం బల్లి ఉన్న సమోసాతో స్వీట్ హౌస్ దగ్గరికి వచ్చి ప్రశ్నించగా.. ఓనర్ షాప్కు తాళం వేసి పారిపోయాడు. తర్వాత ఎంపీడీవోకు సమాచారం ఇవ్వగా... సిబ్బందిని పంపించి షాప్ ను సీజ్ చేయించారు. అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.