09-07-2025 11:06:05 PM
ఒకరి పరిస్థితి విషమం..
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గద్వాల ప్రభుత్వ కళాశాలలో విద్యాబ్యాసం చేస్తున్న చరణ్ తేజ, రవితేజ అనే అన్నదమ్ములపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇందులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రవితేజ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కి తరలించారు. ఇంటర్ చదువుతున్న చరణ్ తేజకు స్వల్ప గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన చెల్లిని ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఆరుగురు యువకులు వచ్చి పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని బండి ఆపి కత్తులతో దాడి చేశారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చరణ్ తేజ తెలిపారు.