calender_icon.png 10 July, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి ప్రభుత్వ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ నరసింహ

09-07-2025 10:49:49 PM

చివ్వేంల (విజయక్రాంతి): మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ(District SP Narasimha) బుధవారం రాత్రి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. తరగతి గదిని ప్రయోగశాల లాగా మార్చుకోవాలని, విద్యార్థి భవిష్యత్తు తరగతి గదితోనే ఉన్నదని అన్నారు. విద్యార్థులకు పండ్లు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై  మహేష్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు, స్థానిక పౌరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.