calender_icon.png 10 July, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో ఔషధ మొక్కల పంపిణీ

09-07-2025 10:52:20 PM

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ, యంగ్ ఎర్త్ లీడర్స్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల పంపిణీ..

హుజూర్ నగర్: పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలను నాటారు. పర్యావరణంలో భాగంగా ప్రతి స్కూల్ పచ్చదనంతో పాటు ఔషధ మొక్కల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉద్దేశంతో మొక్కలను విశ్రాంత డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ రఫీయుద్దీన్(Deputy Forest Range Officer Mohammed Rafiuddin) సూచనల మేరకు  ఔషధ వనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు శైలజ, సీజిఆర్ అడ్మిన్ ఆఫీసర్ అనుదీప్, సిజిఆర్ జిల్లా కోఆర్డినేటర్ మామిడి శంకరయ్య, ఫీల్డ్ కో ఆర్డినేటర్ కత్తి కోటయ్య, స్కూల్ ఎర్త్ లీడర్స్, యంగ్ ఎర్త్ లీడర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.