calender_icon.png 27 September, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ సద్దుల బతుకమ్మ వేడుకలకు కేంద్రమంత్రి బండి సంజయ్‌కి ఆహ్వానం

27-09-2025 12:27:35 AM

వేములవాడ: పట్టణంలో శనివారం  జరగబోయే సద్దుల బతుకమ్మ వేడుకలకు కేంద్ర హోం మంత్రి శాఖ రాష్ట్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శుక్రవారం వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రేగుల రాజ్‌కుమార్, బచ్చు వంశీ, వాసం మల్లేశం యాదవ్, జవ్వాజి శేఖర్, రేగుల శ్రీకాంత్, కీసర యశ్వంత్ తదితరులు బండి సంజయ్‌ను కలసి వేడుకలకు విచ్చేయాలని కోరారు.

వారు మాట్లాడుతూ... సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా, మహిళల ఆరాధన ఉత్సవంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది వేడుకలను మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఆహ్వానాన్ని స్వీకరించి వేడుకల్లో పాల్గొనేందుకు హామీ ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా వేములవాడ పట్టణంలో భారీగా భక్తులు, మహిళలు, ప్రజలు పాల్గొంటారని తెలిపారు.