calender_icon.png 27 September, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28న ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సును విజయవంతం చేయండి

27-09-2025 12:27:30 AM

తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం

ఖైరతాబాద్, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి) : ప్రజాస్వామ్య పరిరక్షణ న్యాయవ్యవస్థ ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని అంశంపై ఈనెల 28న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం (టిఎస్‌డిఎఫ్), జాగో నవ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు ను విజయవంతం చేయాలని ఫోరం  చైర్మన్ మాజీ జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు శుక్రవారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు దిడ్డి సుధాకర్, ఓట్ నీడ్ గ్యారెంటీ ఆర్గనైజేషన్ షుగర్ బేగం,

సిపిఐ ఎంఎల న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హమేష్ తదితరులతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తో పాటు వామపక్షాల నేతలు, మేధావులు తదితరులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు.