calender_icon.png 27 September, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవభక్తి సన్మార్గంలో నడిపిస్తుంది

27-09-2025 12:28:10 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): దైవభక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని...కాళికాదేవి ఆశ్శీస్సులు అందరిపైనా సంపూర్ణంగా ఉండాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక కాళికాదేవి ఆలయంలో కొలువైన కాళికాదేవి మూల విరాట్ ను ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విజయదశమి పం డుగ ప్రతి ఇంటికి సుఖసంతోషాలు తీసుకురావాలని అమ్మవారిని కోరారు.

అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు యాదిరెడ్డి, రఘుపతి రెడ్డి, కాళికాదేవి కాళేశ్వర స్వామి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పండరయ్య, అధ్యక్షులు వెంకటయ్య, ఉపాధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.