calender_icon.png 22 May, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ విద్యార్థులకు మంత్రి అభినందనలు

22-05-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే21(విజయ క్రాంతి): ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక పిటిజి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బుధవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, గురుకులాల కార్యదర్శి  సీతా లక్ష్మీ, కమిషనర్ శరత్‌ల చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

గురుకులం ప్రిన్సిపల్ కారం భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని పిటిజి పాఠశాల నుండి విష్ణువర్ధన్, హరవింద్‌లు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో గురుకులం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన  సక్సెస్ మీట్ లో మంత్రి ,కార్యదర్శి,కమిషనర్‌లు విద్యార్థులను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రా లు అందజేశారన్నారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్స్ సుజాత, కృష్ణచారి సిబ్బంది అభినందించారు.