22-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 21(విజయక్రాంతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఎవరు ఇబ్బంది పెట్టిన శాఖపరమైన చర్యలు ఉం టాయని బైంసా ఆర్డిఓ ఇన్చార్జ్ డిఎస్‌ఓ కోమల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోల నిర్వహణపై అధికారులు రైతులతో మాట్లాడారు.
జొన్నల కొనుగోలు అక్రమాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర జొన్నలకు కొందరు ఇక్కడికి తీసుకువచ్చి బినామీ పేరుతో విక్రయిస్తున్నారని రైతులు అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్, అధికారులు పాల్గొన్నారు.