12-10-2025 02:45:55 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : టీస్కేర్ నిర్మాణం తెలంగాణ ఐ కానిక్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాయదుర్గం సమీపంలో చే పట్టనున్న నిర్మాణ పనులు నవంబర్ నెల చివరకల్లా ప్రారంభం కావాలని సూచించారు. ఏఐ హబ్, టీస్కేర్ ప్రాజెక్టులపై ఐ సీసీసీలో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పా ర్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీ స్క్వేర్‌లో ఆపిల్ లాంటి ఇంట ర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులతో ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని చెప్పారు. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని, టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలని, సందర్శకులను ఆకట్టుకునేలా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. రంగురంగుల డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్ప్లే తో రూపొందించాలని చెప్పారు. యాపిల్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం అక్కడ వ్యాపారం నిర్వహించేలా ఉండాలన్నారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు ఉండాలన్నారు. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలతో పాటు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా టీ-స్క్వేర్ రూపుదిద్దుకోవాలి.. అని చెప్పారు.
ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు ఏఐ హబ్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశం లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.