calender_icon.png 12 October, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ ఆశచూపి మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ అరెస్టు

12-10-2025 03:41:19 AM

రెండు కార్లు, డాక్యుమెంట్లు స్వాధీనం

నల్లగొండ క్రైం, అక్టోబర్ 11: అధిక వడ్డీ ఆశచూపి, ప్రజలను నిలువునా ముంచిన నిందితుడు రమావత్ బాలాజీ నాయక్‌ను  శనివారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు కార్లు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శరత్ చంద్రపవర్ వివరాలను వెల్లడించారు. పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన బాలాజీనాయక్ రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేశాడు. దందాకు అనుగుణంగా ఏజెంట్లను నియమించుకుని ఆ యా గ్రామాల ప్రజల నుంచి రూ.౫౦ కోట్ల వరకు వసూలు చేశాడు. కొన్ని నెలలు గా బాధితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వకపోయే సరికి, బాలాజీ పై ఒత్తిడి చేయడంతో పారిపోయాడు. పోలీసులకు బాధితులు ఫి ర్యాదు చేయడంతో శనివారం అతడిని అరెస్టు చేశారు. బాలాజీ, బినామీల పేరిట ఉ న్న ఆస్తులను గుర్తించి కోర్టు ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు.