04-07-2025 01:21:20 AM
నిర్మల్, జూలై 3(విజయక్రాంతి): అస్వస్థకు గురై సోమాజిగూడ యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.