calender_icon.png 4 May, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ చేసింది కులగణన కాదు.. క్యాస్ట్ సర్వే : మంత్రి కిషన్ రెడ్డి

03-05-2025 05:47:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు.. కేవలం క్యాస్ట్ సర్వే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. క్యాస్ట్ సర్వేను కూడా తుతూ మంత్రంగా చేశారని, బీసీలలో ముస్లీంలను కలపడం రాజ్యంగ విరుద్ధం అని కిషన్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో మొట్టమొదటి సారిగా జనగణనతో పాటు కులగణన జరుగుతోందని, బీజేపీ పార్టీ సమగ్రమైన బీసీ కులగణన చేపట్టబోతుందని తెలిపారు. తెలంగాణలో కులగణనే జరగలేదు... రూల్ మోడల్ ఎలా అవుతుంది..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణలో కులగణన జరిగితే చర్చకు సిద్ధమని సవాలు చేశారు. మోదీ ప్రభుత్వం పదేళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తోందని, రహదారులు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని, వాజ్ పేయీ హయంలో స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. రోడ్ల నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చు ఎందుకని ఆనాడు కొందరూ విమర్శించారని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక రహదారులు నిర్మాణాన్ని వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, హైదరాబాద్-శ్రీశైలం మధ్య నాలుగు లైన్ల ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉందన్నారు. భూసేకరణ కాకపోవడం వల్ల రాహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతోందని, ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే అంత త్వరగా రహదారులు పూర్తవుతాయని చెప్పారు. రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని, అందుకోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో రూ.5416 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని, హైదరాబాద్-ఆదిలాబాద్ జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి పూజ జరుగుతోందన్నారు. అలాగే అంబర్ పేట ఫ్లై ఓవర్ తో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.