17-07-2025 12:40:57 AM
యాదాద్రి భువనగిరి జూలై 16 ( విజయ క్రాంతి ) : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డుల ప్రక్రియ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై మంత్రి అడగగా సంబంధిత అధికారులు జిల్లాలో మొత్తం 9,374 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని , అందులో బాగంగా 6,836 ఇండ్లు మార్క్ ఔట్ చేయడం జరిగిందని, ఇంకొన్ని వివిధ దశలో ఉన్నాయని మంత్రికి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో అతిపేద లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా జిల్లాలో లోన్లు ఇప్పించామని తెలిపారు.
జిల్లాలో అర్హులైన లబ్ధిదేలకు కొత్త రేషన్ కార్డుల గురించి సంబంధిత అధికారులు మంత్రికి వివరిస్తూ జిల్లాలో 11960 రేషన్ కార్డ్ లు మంజూరు చేయడం జరిగిందని అట్టి కార్డ్ ల కు 38,328 కుటుంబ సభ్యులు కలిగియున్నారని, ఇవి కాక మెంబర్ ఎడిషన్ కింద 33879 కార్డ్ లకు గాను 56,645 కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చడమైనదని అదే విధముగా జిల్లా లో మొత్తం 45,839 కార్డు లకు గాను 94,973 కుటుంబ సభ్యులను నమోదు చేయడం జరిగిందని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.