29-07-2024 12:49:45 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది. జగదీశ్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నాని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జగదీశ్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని మంత్రి వెల్లడించారు. దొంగతనం కేసులోనూ జగదీశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నారన్నారు. మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో జగదీశ్ రెడ్డి ఏ2 గా ఉన్నారని చెప్పారు. జగదీశ్ రెడ్డిని ఏడాదిపాటు జిల్లా నుంచి బహిష్కరించారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపిస్తానని మంత్రి తెలిపారు. ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.