calender_icon.png 14 November, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: జగదీశ్ రెడ్డి

29-07-2024 12:53:48 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.  కోమటి రెడ్డి మాట్లాడిన ప్రతీ అక్కరం రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్ రెడ్డి కోరారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఓక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రానన్నారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.  తనపై ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మూడు కేసుల్లో కోర్టులు తనను నిర్దోషిగా తేల్చాయని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకులు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారని తెలిపారు. వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని జగదీశ్ రెడ్డి కోరారు.