calender_icon.png 9 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ నాగారంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుక

09-09-2025 04:35:18 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తరిగొప్పుల మండలం అబ్దుల్ నారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ కార్యదర్శి  కంకటి రవీందర్ కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజి నారాయణ తెలుగు సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో చేసిన కృషి విశేషమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడి టీచర్ మంజుల, పరుశరాములు, ఇతర సిబ్బంది పాల్గొని కాళోజి నారాయణకి నివాళులు అర్పించారు.