29-09-2025 12:26:14 AM
- కాంగ్రెస్ నుండి ఆరోగ్య మంత్రి దామోదర తనయ త్రిష ?
- బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులపై మల్లగుల్లాలు
సంగారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):ఎట్టకేలకు స్థానిక సంస్థలకు సం బంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎ న్నికలకు మార్గం సుగమనం అయింది. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు దగ్గర పడుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల ని ర్వహణకు గ్రహణం పట్టింది. రేపు, మాపు అంటూ కాలయాపన చేసినప్పటికీ చివరికి బీసీ రిజర్వేషన్ల ప్రాతిపదిక తెరమీదికి రావడంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందా కనే ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు.
కా నీ అనూహ్యంగా స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం, శనివారం నాడు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయ డం జరిగింది. దీంతో ఎన్నికలకు మార్గం సుగమనం అయింది. నవంబర్లో దీపావళికి ముందే ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ను ఎస్సీ జనరల్, మెదక్ ఓసీ జనరల్, సిద్దిపేట బీసీ జనరల్ గా ఖ రారు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యూహాలు మారిపోయా యి. సిద్దిపేటలో బీఆర్‌ఎస్కు చెక్ పెట్టేందుకు బీసీ జనరల్ కేటాయించడం, మెదక్లో ఓసీ జనరల్ రావడం వ్యూహాత్మకమైనప్పటికీ, సంగారెడ్డి జడ్పీ రిజర్వేషన్తో పాటు ఈ పీఠం కైవసం చేసుకోవడంలో జిల్లా మంత్రి దా మోదర రాజనర్సింహ్మ మార్క్ మాత్రం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి జడ్పీ రేసులో త్రిష..?
సంగారెడ్డి జిల్లా పరిషత్ పీఠాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ స్థానాన్ని ఎస్సీ జనరల్ కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ స్థానానికి ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ కూతురు త్రిష పేరు ప్రథమంగా వినిపిస్తోంది. అయితే ఆమె ఏ మండలం నుండి పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి గట్టి పోటీనివ్వడమే కాకుండా జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడానికి మంత్రి దా మోదర రాజనర్సింహ్మ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జడ్పీ చైర్మన్ రేసులో త్రిషతో పాటు ఇంకా ఎవరెవరు రంగంలో ఉండనున్నారో మున్ముందుతేలనుంది.