calender_icon.png 22 May, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలామృతంలో బల్లి?

21-05-2025 12:04:41 AM

గూడూర్, మే 20 (విజయ క్రాంతి): స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్ల ద్వారా చిన్న పిల్లలకు అందించే పోషకాహారమైన బాలామృతం లో బల్లి దర్శనం ఇచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గొల్లగూడెంలో చోటుచేసుకుంది. ఏడాది న్నర బాలుడు మండల దేవాన్ష్ కు అంగ న్వాడీ కేంద్రం నుండి ఈనెలలో బాలా మృతం ప్యాకెట్ అందజేశారు.

మంగళ వారం తల్లి ప్రియాంక కుమారుడికి తినిపిం చడానికి బాలామృతం ప్యాకెట్ చించి ఒక బౌల్లో పోయగా అందులో చచ్చిన బల్లి పిల్ల కనిపించడంతో హతాషురాలయ్యింది. వెంటనే ఈ విషయాన్ని స్థానిక అంగన్వాడీ కేంద్రం టీచర్ సువర్ణకు తెలిపినట్లు చెప్పి ంది. 

పిల్లలకు పౌష్టికాహారం బాలా మృతం ప్యాకెట్ లో బల్లి వచ్చిన సంఘటన పై విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.