13-12-2025 12:33:09 AM
గుర్తు గుర్తుంచుకో..కత్తెర గుర్తుంచుకో..-మంత్రి సీతక్క
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్12 (విజయక్రాంతి): వెంకటాపూర్ మండల కేంద్ర కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుగుణ స్వామి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ప్రచారానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుగుణ స్వామి క త్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వెంకటాపూర్ మండల కేంద్రాన్ని అన్ని రం గాలలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పా ర్టీ బలపరిచిన సుగుణ స్వామి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని తద్వారా మహిళలకు యువతకు పేదలకు అన్ని వర్గాల వారికి అభివృద్ధి పథకాలు అందేలా తగిన కృషి చేస్తామని, విద్యా వైద్యరంగంలో క్రీడలలో వెంకటాపూర్ మండల కేంద్రానికి అవసరమైన రీతిలో అన్ని రకాల అభివృద్ధి పథకా లను అందజేసి జిల్లాలోని మండల కేంద్రా న్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
అనంతరం డిసిసి అధ్యక్షుడు పైడాకుల అ శోక్ మాట్లాడుతూ.. వెంకటాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుగు ణ స్వామి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకుని సుగుణ స్వామి ని గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచా రంలో జిల్లా కాంగ్రెస్ నేతలు,మండల నా యకులు పెద్ద ఎత్తున ప్రజలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.