calender_icon.png 13 December, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య ఎంపీటీసీ.. భర్త సర్పంచ్..

13-12-2025 12:31:06 AM

దంపతులను ఆదరించిన ఇనుగుర్తి ఓటర్లు..!

మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం ఎంపీటీసీ, సర్పంచ్ గా భార్య భర్తలు వరుసగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ్మడపల్లి కుమార్ సర్పంచ్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామంలో ఒక ఎం పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో తన సతీమణి రజిని ని పోటీకి నిల పడంతో ప్రజలు ఆమెను ఎంపీటీసీగా ఎ న్నుకున్నారు.

తాజాగా గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇనుగుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుతో ఎన్ని కల బరిలో తిరిగి నిలిచిన తాజా మాజీ ఎం పీటీసీ తమ్మడపల్లి రజని భర్త కుమార్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గతంలో జరిగిన సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలిచిన బేతమల్ల చంద్రయ్య ఈసారి కూడా ప్రత్యర్థిగానే ఎన్నికల బరిలో బారాస మద్దతుతో నిలిచి రెండోసారి పరాజయం పాల య్యాడు. 270 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఇనుగుర్తి మండల కేంద్రం, మేజర్ పంచాయతీ సర్పంచ్ గా తమ్మడపల్లి కుమార్ విజ యం సాధించారు.

రెండోసారి సర్పంచులుగా ఎన్నిక

కేసముద్రం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితా ల్లో కొందరు అంది వచ్చిన రిజర్వేషన్లతో రెండోసారి పోటీచేసి సర్పంచులుగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. కేసముద్రం మండలం తావూరియా తండాలో మాజీ సర్పంచ్ మూడవత్ బుజ్జి గతంలో ఉమ్మడి మహముద్ పట్నం గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తాజాగా గురువారం జరిగిన ఎ న్నికల్లో మళ్లీ మూడవత్ బుజ్జి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

ఇదే విధంగా ఇంటికన్నె గ్రా మ మాజీ సర్పంచ్ భూక్యా మంగ్త్యా కూ డా గతంలో సర్పంచ్ గా ఎన్నికవ్వగా, మళ్లీ ఇ ప్పుడు సర్పంచిగా ఎన్నికయ్యారు. ఇక గతం లో అమీనాపురం గ్రామ ఎంపీటీసీగా ఎన్నికైన బానోతు బద్రు ఈసారి సప్పిడి గుట్ట తండా గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యా రు. అలాగే కాట్రపల్లి ఎంపీటీసీగా గతంలో గెలుపొందిన ఎద్దుల పోయిన రాణి భర్త సూరయ్య ఇప్పుడు కాట్రపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అలాగే బేరివాడ ఎంపీటీసీగా గతంలో ఎన్నికైన ఈసం లక్ష్మీనారాయ ణ సతీమణి విజయలక్ష్మి ఈసారి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

ప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్‌ఎస్...

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 12(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలాల్లో ప్రచా రం జోరు అందుకుంది. పోటీలో నిలిచిన అ భ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచా రం ముమ్మరంగా సాగుతోంది. మండలా ల్లో ప్రధానంగా మేజర్ పంచాయతీలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. టిఆర్‌ఎస్ పార్టీ తెలుగుదేశం బలపరిచిన వెంకటాపురం మేజర్స్ ఎం పంచాయతీ స ర్పంచ్ అభ్యర్థిని విజయ కుమారి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

శుక్రవా రం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి ప్ర ధాన రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి విజయ కుమారి ప్రతి దుకాణానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. త నకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. భా రీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు గొడవ ర్తి నరసింహమూర్తి, ముడుంబ శ్రీనివాస్, వే ల్పురి లక్ష్మీనారాయణ, జాగర శివాజీ యా దవ్, శాంతమూర్తి యాదవుల తో పాటు తె లుగుదేశం పార్టీ నాయకులు ఆత్మకూరి పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (విజయ క్రాంతి)స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో భాగంగా....హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం, గట్లనర్సింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొల్లంపల్లి అజయ్ కుమార్ (సర్పంచ్) ఉప సర్పంచ్ బోడిగే శ్రీనివాస్ లకు ఎన్నికైన శుభ సందర్భంగా సర్పంచ్.ఉపసర్పంచ్ వార్డు సభ్యులు సాయిరాం, వీరబద్రనగర్ గ్రామ ఉప సర్పం చ్ పాక సంపత్ లకు శాలువాతో ఘనంగా సత్కరించిహుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోమాజీ ప్రజా ప్రతినిధుల నా యకులు కార్యకర్తలు గ్రామ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.