calender_icon.png 30 August, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా గోస తీరేదేన్నడు?

30-08-2025 02:11:34 PM

మండలంలో యూరియా కొరత

ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలు అంతంతే

సింగిల్ విండోలకు కేటాయింపులు అరకొరే

అరిగోసపడుతున్న అన్నదాతలు

మిడ్జిల్:  యూరియా కోసం రైతులు స్పష్ట కష్టాలు పడుతున్నారు.  రోజులు గడుస్తున్న కొరత తీరక రోడ్ ఎక్కుతున్నారు. వరి పత్తి మక్కా మిర్చి పంటలకు మీడియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.  ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు.  ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వానలో తడుస్తూ నిల్చునా, రాత్రి వరకు బారులు తీరిన సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు బిఆర్ఎస్ పాలనలోలేని ఈ దుస్థితి ఇప్పుడెందుకు వచ్చిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.  కెసిఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలా ఇబ్బంది పడలేదని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.