30-08-2025 02:22:08 PM
కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనిఖీలు
ఎన్ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్
కలెక్టర్ తనిఖీలతో అధికారులు, సిబ్బంది హడల్
మెదక్, (విజయక్రాంతి): ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్.ఐసి కార్యాలయ పనితీరు బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై మెమో లు జారీ చేయాలన్నారు.
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు. వివిధ శాఖల అధికారుల, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.