calender_icon.png 30 August, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనానికి పగడ్బందీగా ఏర్పాట్లు

30-08-2025 02:23:49 PM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం(Ganesh immersion) జరిపేందుకు అవసరమైన ఏర్పాటను పగడ్బందీగా చేపట్టాలని జిలా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు తో కలిసి వినాయక నిమజ్జనం జరిగే మెదక్ మండలం  కేంద్రంలో కోమటూరు  చెరువును సందర్శించి ఏర్పాట్లను  పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, క్రేన్లు,  ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గజఈతగాల్లతో పాటు వాటంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్ రెడ్డి, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు