30-08-2025 01:18:57 PM
హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy ) సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నేత బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, రామకృష్ణ, ప్రొ. హరగోపాల్, గుమ్మడి నర్సయ్య, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ ఎన్. వి. రమణ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్‌లో దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.