30-08-2025 01:59:40 PM
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేఖర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు హరీశ్ కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో(Osmania Hospital) శనివారం శేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నిన్న రాత్రి ప్రియుడు హరీశ్ తో కలిసి భర్త శేఖర్ ను భార్య చంపింది.
నిద్రలో ఉన్న శేఖర్ ను గొంతు నులిమి డంబెల్ తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. సరూర్ నగర్ పోలీస్(Saroor Nagar Police) స్టేషన్ కు చేరుకున్న మృతుడు శేఖర్ బంధువులు తమకు న్యాయం జరిగే వరకు మృతదేహం వద్దకు వెళ్లబోమని తేల్చిచెప్పారు. కేసు విచారణ పారదర్శకంగా చేస్తామని పోలీసులు నచ్చజెప్పారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం హత్యలకు దారి తీస్తుంది. ప్రియుడి మోజులో పడి భార్యలు భర్తలను చంపేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడి సాయంతో భార్య హత్య చేయించిన ఘటన శుక్రవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.