30-08-2025 02:14:01 PM
యూరియా కోసం రైతుల పడిగాపులు
నవాబ్ పేట్: రైతులు పొద్దెక్కితే యూరియా బస్సుల కోసం క్యూ లైన్ లో నిల్చుంటు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎసీసీఎస్ వద్ద నిన్న ఉదయం 6 గంటల నుంచే రైతులు పడిగాపులు కాశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు యూరియా వచ్చిన అధికారులు పంపిణీ చేయలేదు. శనివారం ఉదయం పంపిణీ చేస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆది తెలుసుకున్న నవాబ్ పేట్ మండల రైతులు భారీగా శనివారం రాత్రి నుంచి పీఏసీసీఎస్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ఉదయం 10 గంటలకు యూరియా పంపిణీ ప్రారంభించారు. 600 బస్తాలు యూరియా మాత్రమే ఉన్నందున ఒకరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వచ్చిన రైతులలో సగం రైతులకు మాత్రమే 600 బస్తాల యూరియా సరిపోయింది. మిగిలిన రైతులు రెండు రోజులు నుంచి పీఏసీసీఎస్ దగ్గర పడిగాపులు కాస్తున్నా యూరియా లభించకపోవడం తో రైతులు ఆవేదన చెందారు.