30-08-2025 02:16:13 PM
గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య
జిన్నారం గుమ్మడిదల,(విజయక్రాంతి): గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మధారం గ్రామంలోని అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల, రోడ్డు వెంట మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య తెలిపారు. వన మహోత్సవంలో(Van Mahotsav) భాగంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామం లో తిరిగి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ బొమ్మ సమీపంలో వాటర్ లీకేజ్ అవుతుండడంతో కాంట్రాక్టర్లు మరమ్మత్తులు నిర్వహిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. వారికి శాశ్వతగా పరిష్కారం అవ్వాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు తమ వార్డుల్లో, రోడ్డు వెంట, ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచినట్లయితే పచ్చదనంతో పాటు ప్రతి ఒక్కరి స్వచ్ఛమైన గాలి వస్తుందని, దీనివల్ల అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది బాలరాం, నవీన్, నర్సింగ్ పాల్గొన్నారు.