30-08-2025 01:32:25 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) శనివారం ఉదయం ప్రారంభమై ఆదివారం ఉదయం 9 గంటలకు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు. రిజర్వేషన్ల పరిమితి బిల్లు సవరణపై క్యాబినెట్ తీర్మానించే అవకాశముంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చర్చిస్తున్నారు. రైతులను ఆదుకోవడంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోరుతూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.