03-05-2025 05:54:28 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పితృవియోగానికి గురైన ములుగు సీఐ దారం సురేష్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. సీఐ సురేష్ స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారు కట్టుగూడెం గ్రామానికి మంత్రి శనివారం వచ్చారు. సీఐ సురేష్ తండ్రి దివంగత దారం వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, సిఐని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, పీ సీ సీ సభ్యుడు గూగులోత్ దస్రు నాయక్, బండారు వెంకన్న, కదిరే సురేందర్, కురెల్లి సతీష్, సిహెచ్ వసంతరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్టయ్య, కాకి విజయ, వీర రెడ్డి, రావుల కొమరయ్య, కంకల కొమరయ్య, కోయ్యడి అశోక్, దారం శ్రవణ్, మంగ గణేష్, శేఖర్ రెడ్డి, కనుకుల రాంబాబు, తోట అఖిల్ తదితరులు పాల్గొన్నారు.