21-07-2025 12:00:00 AM
ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పి. పరుశురాం
ఘట్ కేసర్, జూలై 19 :శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పి. పరుశురాం అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్ లో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం అనే కార్యక్రమం ద్వారా చేపట్టు పది అంశాలపై రూపొందించిన పోస్టర్ ను ముఖ్య అతిధిగా వి చ్చేసిన సీఐ పరుశురాం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్యతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ పరశురాo మాట్లాడుతూ నేడు పౌరులు సామాజిక బాధ్యత మరిచి, స్వార్థంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. కళ్ళ ముందు ఏమి జరిగిన, తమ చుట్టు ఎలా ఉన్నా, ఎవరైన వచ్చి చేస్తే బాగుంటుంది, చేయాలి అనడం తప్ప తాను ఏమి చేస్తున్నాను, తన బాధ్యత ఏమిటనేది మర్చి పోతున్నారని, స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమాజ శ్రేయస్సు కో సం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు. అంతకు ముందు వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య మాట్లాడుతూ కుల మత వర్గ రాజకీయాలకు అతీతంగా శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం అనే నినాదంతో మన ఊరి బడులను మనం బాగు చేసుకోవాలని, మన బడులు మన బాధ్యత, సామాజిక చైతన్యం, పర్యావరణాన్ని పదిలపరుద్దాం భవిష్యత్తుకు భరోసా నిద్దాం, మద్యం మాదకద్రవ్యాల పై యుద్ధం, సైబర్ నేరాలపై సమరం, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రకృతి సేద్యం, పేరటి, మిద్దె తోటలకు ప్రోత్సాహం, భారత రాజ్యాంగంపై అవగాహన, ఓటు హక్కు వినియోగం, ఆహారం వృధా వద్దు, అనార్థుల ఆకలి తీర్చడమే ముద్దు, మూడ విశ్వాసాలను తరిమి కొడదాం, శాస్త్రీయ అభివృద్ధిని అందిపుచ్చుకుందాం, బాలల హక్కుల పరిరక్షణ అను అంశాలపై క్షేత్ర స్థాయి నుండి ప్రజలందరినీ భా గస్వామ్యం చేస్తు ముందుకు వెల్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు మాట్లాడుతూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో కరోన సమయంలో నిరుపేదలకు నిత్యవసర వస్తులు పంపిణీ చేయడం, వరదల సమయంలో వరదలకు ఇండ్లు మునిగి పోయి ఆకలి దప్పికలతో ఉన్న ఎంతో మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని, భారత రాజ్యాంగం విలువలను తెలిపే విధంగా గడప గడపకు మన భారత రాజ్యాంగం కార్యక్రమం ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, శాస్త్రీయ ఆలోచన కలిగిన వ్యక్తులు స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేపట్టు కార్యక్రమంలో భాగస్వామ్యం కావలని కోరారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. జానకిరాం, ఎన్‌ఎస్‌ఎస్ కో-అర్డినేటర్ డాక్టర్ హరిప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూప, ఆర్గనైజేషన్ సభ్యులు మేకల సురేష్, వరికుప్పల లింగస్వామి, అనిల్ కుమార్, మీసాల రాజేష్ కుమార్, రాజు, నాగరాజు, చెన్నయ్య, నరేష్, దశరథ్, సాయి సూరజ్, సంస్కృతి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.