03-01-2026 12:35:57 AM
గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై మంత్రి శ్రీధర్‌బాబు
ప్రజలపై పన్నుల భారం ఉండదని స్పష్టీకరణ
కార్పొరేషన్ల విభజనపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
బీఆర్‌ఎస్ బాయ్‌కాట్‌పై ఆగ్రహం
బీఆర్‌ఎస్‌కు బీజేపీ ఫోబియా అంటూ ఎద్దేవా
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసేదిశగా ప్రభుత్వం ముందుకు వె ళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పౌరు లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు సమాన సర్వీసులు, శివారు ప్రాంతాలకు ఆర్థిక వనరు లను అందిస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడనీయమని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామనే అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేసి.. 300 వార్డులుగా విభజించాం. జీహెచ్‌ఎంసీ జనరల్‌బాడీ సమావేశంలోనూ చర్చ జరిగింది. విభజన సమయంలో 5,935 మంది నుంచి సూచనలు వస్తే.. వాటిలో 1,127 సూచనలు ఆమోదించాం. సరిహద్దుల మార్పుపై కూ డా సూచనలు స్వీకరించాం. సాధారణ ప్రజలతోనూ మాట్లాడాం. దాదాపు 27 శాతం ప్రజల సూచనలు పరిగణలోకి తీసుకొని విభజించాం. 14 ఏళ్లలో గ్రేటర్ పరిధిలో జనాభా రెండింతలు పెరిగింది. గత ఏడాది కాలంగా ప్రజాస్వామ్య విధానంలోనే గ్రేటర్ విలీనం ప్రక్రియ జరుగుతోంది’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు..
మూసీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందిస్తున్నారు. మూసీ విషయంలో స భ్యుల సూచనలు, సలహాలు స్వీకరిస్తామని సీఎం చెప్పారు. ‘గ్రేటర్‌ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తాం. ప్రాథమికంగా మా త్రం మూడు కార్పొరేషన్లుగా విభజించాలని అనుకుంటున్నాం. జీహెచ్‌ఎంసీలో వార్డుల సమస్య ఉంటే పరిష్కరిస్తాం. ఇప్పటికే 8మంది జోనల్ కమిషనర్లను నియమిం చాం. హైదరాబాద్ పరిశీలనకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించాం. గత ప్రభుత్వం సిబ్బందిని నియమించకుండానే జిల్లాలను 33కి పెంచి.. 33 కలెక్టరేట్లను నిర్మించింది. కానీ వాటిలో సిబ్బంది లేరు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ద్వారా కలెక్టరేట్లలో సిబ్బందిని నియ మించాం. ’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
360 డిగ్రీలు కవర్ చేసేలా మెట్రో విస్తరణ..
హైదరాబాద్‌ను 360 డిగ్రీలు కవర్ చేసేలా.. మెట్రో విస్తరణ చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మెట్రో ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు, నిర్వహణలో సమస్యలు రావొద్దనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభు త్వం టేకోవర్ చేస్తోందని చెప్పారు. ‘ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండె క్స్ 174 పాయింట్లు ఉంది. నగరంలో గాలి నాణ్యత మున్ముందు పడిపోకూడదని భావిస్తున్నాం. కాలుష్యం పెరిగిపోకూడదనే.. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించే ప్రక్రియను చేపట్టాం. అందుకు హైదరాబాద్‌లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం
బీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పట్టుకున్నదని మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో జరిగే చర్చలో భా గంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందనే భయపడి సభ నుం చి బీఆర్‌ఎస్ పారిపోయిందని విమర్శించారు. 15 రోజులు సభ పెట్టాలని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్.. ఒక రోజు కే ఎందుకు పారిపోయిందని మంత్రి ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని ప్రకటించారని, ఇ ప్పుడు వాళ్లే సభ నుంచి పారిపోయారని మండిపడ్డారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడించిందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును కూడా తొలగించారని విమర్శించారు.