calender_icon.png 3 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిడ్మాను పట్టించిన వారిని చంపేస్తాం

03-01-2026 12:35:15 AM

  1. అడవులు దోచుకునేందుకే ఆపరేషన్ కగార్
  2. బీకే ఏఎస్‌ఆర్ విప్లవ్ పేరు మీదుగా మావోయిస్టుల లేఖ  

చర్ల, జనవరి 2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సంబంధించిన ఓ ప్రముఖ అధికార పార్టీ రాజకీయ నాయకుడు ఇద్దరు చంపించడంలో కీలకపాత్ర పోషించాలంటూ ఆరోపిస్తూ మావో యిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ నాయకులపై జరుగుతున్న హ త్యాకాండను ఎన్ కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని. ఈ బ్రహ్మణీయ ఫాసిస్టు భాజాపా ప్ర భుత్వాలు ఆడవులలో ఖనిజ సంపదను ఎత్తుకెళ్తేందుకు ఆదివాసులపై, ప్రజల కోసం పోరాటం చేస్తున్నవారిని హత్యచేస్తున్నారని.

ఆపరేషన్ కగార్ మారణహోమం కొనసాగుతున్నప్పటికీ, గత ఫిబ్రవరి, మే‘ నెలల్లో వేలా ది ఎకరాల భూమిని అర్సెలర్ మిట్టల్, రుం గ్లా స్టీల్, లాయిడ్ వంటి కార్పోరేట్ కంపెనీలకు అప్పగించారన్నారు. ఇది కేవలం ఆదివాసీల సమస్య లేదా మావోయిస్టు సమ స్యనే కాదు, ఇది మనదేశ ప్రజలకు సంబంధించిన సమస్య మనమందరం పోరాడు దాం అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో మా పార్టీ హతమార్చిన కాంట్రాక్టర్ మావోయిస్టు పార్టీని మోసం చేసి మా పార్టీకి ద్రోహం చేసినాడని. మాకు చేసిన ద్రోహన్ని స్వయంగా ఒప్పుకున్నాడని.

అం దుకే మా కోర్టులో శిక్ష వేసినామని లేఖలో వివరించారు.మా దృష్టిలో ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారని. వారికి కూడా త్వరలో శిక్ష తప్పదన్నారు. హిడ్మాను, రాజి ఇంకొందరు సభ్యులను మోసం చేసి మా యమాటలు చెప్పి హాస్పటల్ అని తీసుకొని వెళ్లిన కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలిసిపోయిందన్నారు. మా కామ్రేడ్స్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని మావోయిస్టు పార్టీ విప్లవ్ పేరు మీదుగా మావోయిస్టులు శుక్రవారం లేఖ విడుదల చేశారు.