calender_icon.png 12 July, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న ఎల్బీనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

04-04-2025 09:53:01 AM

ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ నెల 7వ తేదీన ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ గురువారం మంత్రిని కలిశారు. వనస్థలిపురం డివిజన్ సమస్యల పరిష్కారంపై మంత్రితో చర్చించారు. అంతేకాకుండా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా మంత్రి స్పందించారు. మంత్రి ఈ నెల 7న నియోజకవర్గానికి వస్తానని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్  తదితరులు ఉన్నారు.