13-09-2025 06:34:27 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండోవ వార్డు మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి పుల్లూరి కళ్యాణ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) శనివారం పుల్లూరి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం తెలిపారు. పుల్లూరి సుధాకర్, కళ్యాణ్ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.