calender_icon.png 18 July, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాదేవపూర్‌లో మడేలయ్య బోనాల పండుగ

14-07-2025 12:51:17 AM

మహదేవపూర్, జూలై 13 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా మడేలయ్య బోనాల పండుగ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో గ్రామంలో ఊరే గింపుగా తమ కుల దైవమైన మడేలయ్యకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కుల సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నూరు వెంకటయ్య, మండల సంఘం అధ్యక్షులు, చిన్నన్న కుల బంధువులు, నాయకులు, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ వామన్ రావు, కాంగ్రెస్ నాయకులు కోట సమ్మయ్య, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.