calender_icon.png 24 January, 2026 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారంలో డ్రైనేజీ పనుల పర్యవేక్షణ

24-01-2026 12:00:00 AM

కార్పొరేటర్ శాంతి 

ఉప్పల్, జనవరి 23 (విజయక్రాంతి) : నాచారం డివిజన్లోని 25 లక్షల వ్యయంతో జరుగుతున్న బాబా నగర్  నుండి హనుమాన్ నగర్ వెళ్లే భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ శాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ కాలనీ లో నెలకొన్న సమస్యలను ఆమె  దృష్టికి తీసుకువచ్చారు దీనికి సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ శాంతి త్వరలోనే సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కొత్తగా వేస్తున్న డ్రైనేజీ లైన్ లోకి  మాత్రమే డ్రైనేజీ లైన్లు కలపాలని వర్షం నీటి లైన్ లోకి డ్రైనేజీ నీళ్లను తొలగించాలని ఆమె అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనే జర్ సిరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ శివ  బిఆర్‌ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ సుజాత చంద్రశేఖర్  శ్రీనివాస్ ఈశ్వర్ పాల్గొన్నారు.