calender_icon.png 18 May, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి

17-05-2025 01:03:15 AM

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్ 

జనగామ, మే 16( విజయ క్రాంతి ) జిల్లాలోని ముస్లిం మైనార్టీలు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్  అన్నారు.  ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం  అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని జామియా మసీదులో  శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో ఉచితమైన నాణ్య విద్యతోపాటు టెకస్ట్ బుక్స్, నోట్ బుక్స్ , పౌష్టికాహారం , వసతి అందజేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణతొకార్పొరేట్ స్థాయిలో దీటుగా విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలను  సాధించిందన్నారు.

జిల్లాలోని ముస్లిం సోదరులందరూ  తమ పిల్లలను మైనారిటీ విద్యాసంస్థల్లో అడ్మిషన్  పొందాలని అన్నారు. ఈ  విషయంలో మైనార్టీ  మతపెద్దలు , నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ P. అనిల్ బాబు స్కూల్ ప్రిన్సిపాల్ కే. కుమారస్వామి అధ్యాపకులు  సల్మాన్ , సిబ్బంది సిద్ధులు, ఫసి తదితరులు పాల్గొన్నారు.