calender_icon.png 18 May, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా వ్యాఖ్యలను కారు పార్టీ వక్రీకరించింది

17-05-2025 01:02:40 AM

  1. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులు డబ్బులు తీసుకున్నారని చెప్పిన
  2. మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి):  బీఆర్‌ఎస్ హయాంలో చిన్న, చిన్న పనులకు కూడా మంత్రులు డబ్బులు తీసుకునేవారని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోష ల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు.

వరంగల్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన వ్యాఖ్య ల మీద కొంత మంది పనిగట్టుకుని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మంత్రులపై తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని, ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని మం త్రి సురేఖ తెలిపారు. మిషన్ కాకతీయలో కమీషన్లు తీసుకున్నారన్నారు.

దళితబంధు పథకంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు  30 శాతం కమీషన్ తీసుకున్నారని కేసీఆరే స్వయంగా చెప్పారని కొండా సురేఖ గుర్తు చేశారు.  తమ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయ కులు వారి పెయిడ్ సోషల్ మీడి యా ద్వా రా విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యా రు. ఇంకోసారి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.