calender_icon.png 3 November, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు నెలల్లోనే అద్భుతం

03-11-2025 02:44:49 AM

  1. మురికి కూపం నుంచి పిక్నిక్ స్పాట్‌గా నల్ల చెరువు
  2. ఆక్రమణల చెర విడిపించి, 30 ఎకరాలకు విస్తరించిన హైడ్రా
  3. అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): ఒకప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయి, నిర్మాణ వ్యర్థాలతో నిం డి దుర్గంధం వెదజల్లిన కూకట్‌పల్లి నల్ల చెరువు.. నేడు నిండుకుండలా మారి, బోటు షికారుకు చిరునామాగా నిలుస్తోంది. కేవ లం ఆరు నెలల వ్యవధిలోనే హైదరాబాద్ రివర్స్ అండ్ లేక్స్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) చేపట్టిన కృషితో ఈ అద్భుతం సాకారమైంది. ఆదివారం అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీ లించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయా లని సూచించారు. చిన్నారుల కోసం రెండు ఆట స్థలాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

-16 నుంచి 30 ఎకరాలకు..

ఒకప్పుడు కబ్జాలతో 16 ఎకరాలకు పరిమితమైన నల్ల చెరువును, హైడ్రా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే చేసి 30 ఎకరాల వరకు విస్తరించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 16 అక్రమ వ్యాపార షెడ్డులను తొలగించింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన టన్నుల కొద్దీ పూడిక, నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో చెరువు లోతు ఏకంగా 4 మీటర్లు పెరిగింది. మురుగు నీరు చెరువులో కలవకుండా శాశ్వత చర్యలు చేపట్టడంతో, ఇటీవలి వర్షాలకు చెరువు స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతోంది. చెరువు చెంతనే బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదిక, నిమజ్జనం కోసం చిన్న కుంటను కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.