calender_icon.png 4 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిమిసంహారక మందు సేవించి ఒకరి మృతి

03-11-2025 07:07:26 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాలను ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన మంగళారపు మల్లారెడ్డి ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులకు తాను ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో తెలియజేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

వెంటనే ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించినప్పటికీ సమాచారం లభించలేదు. కాగా ఉదయం గోకారం గ్రామం పరిధిలో మృతదేహం ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు.