calender_icon.png 4 November, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధిగా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అందజేయాలి

03-11-2025 07:09:49 PM

మందమర్రి (విజయక్రాంతి): సీఎంపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ విధిగా అందజేయాలని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిపిఆర్ఎంఎస్ - ఎన్ఈ మెడికల్ కార్డు(హెల్త్ కార్డు) రెన్యువల్ కోసం సకాలంలో జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అందజేయాలన్నారు. లేని యెడల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, మెడికల్ కార్డు వ్యాలిడిటి నిలిపివేయడం జరుగుతుందన్నారు. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి నవంబర్ నెలలో తమకు సంబందించిన జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ను మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ చేయాల్సి వుంటుందని, ప్రతి సంవత్సరం విధిగా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అందజేయాలని కోరారు.