03-11-2025 07:11:00 PM
నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి
భద్రాచలం,(విజయక్రాంతి): మహిళల వరల్డ్ కప్ ను కైవసం చేసుకుని భారతదేశ సత్తాని ప్రపంచమంతా చాటిన భారత మహిళా క్రికెట్ జట్టును నెహ్రూ కప్ క్రికెట్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి ప్రత్యేకంగా అభినందించారు. భారత జట్టు మహిళలు వరల్డ్ కప్ ఫైనల్స్ లో రాణించిన తీరు ముదావహమన్నారు. తొలిసారి భారత మహిళా జట్టు వరల్డ్ కప్ దక్కించుకోవడం యావత్ భారత జాతి గర్విస్తోందని ప్రశంసించారు. భారత మహిళా జట్టు కెప్టెన్, ఆటగాళ్ల సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారికి సుముచిత గౌరవాన్ని అందించాలని బాలయోగి ఈ సందర్భంగా కోరారు